పారిస్‌లోని ఐఏఎఫ్‌ కార్యాలయంలో దుండగుల చొరబాటు

rafale
rafale

పారిస్‌: ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఉన్న భారత వైమానిక దళానికి చెందిన కార్యాలయంలో దుండగులు చొరబడినట్లు సమాచారం. పారిస్‌ శివారులో ఉన్న ఆ ఆఫీసులో రాఫేల్‌ యుద్ధ విమానాల గురించి ఐఏఎఫ్‌ టీమ్‌ పనిచేస్తున్నది. ఐఏఎఫ్‌ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ టీమ్‌ ఆఫీస్‌పై చొరబాటు ప్రయత్నం జరిగినట్లు డసాల్ట్‌ కంపెనీ వెల్లడించింది. రక్షణ శాఖ, ఫ్రెంచ్‌ ఎంబసీ, భారత వైమానిక దళం దీనిపై ఇంత వరకు స్పందించలేదు. రాఫేల్‌ యుద్ధ విమానం అణు సామర్ధ్యం కలిగినది. ఎవరైనా ఆ సాంకేతిక సమాచారాన్ని దొంగిలిస్తే అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/