అమెరికాలో ఆటా ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం!

ata-health-camp
ata-health-camp

వాషింగ్టన్‌: అమెరికాలో ఉంటున్న తెలుగు వారి కోసం అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) భారీ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. వాషింగ్టన్‌లో దీనిని ఏర్పాటు చేశారు. తెలుగువారితో పాటు ఇతర రాష్ట్రాల వారికీ పరీక్షలు నిర్వహించినట్లు ఆటా అధ్యక్షుడు భువనేశ్‌ భూజాల తెలిపారు. ఈ కార్యక్రమంలో 30 మంది వైద్యులు దాదాపు 600 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారని వెల్లడించారు.


తాజా జాతీయ బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/