బ్రెజిల్‌లో పట్టపగలే భారీ దోపిడీ

Armed men steal, 40 million of gold
Armed men steal, 40 million of gold

సావో పాలో: దక్షిణ అమెరికా బ్రిజిల్‌లో పట్టపగలే భారీ దోపిడి జరిగింది. పోలీసు దుస్తులు వేసుకున్న కొందరు దుండగులు ఓ ట్రక్కులో ఎయిర్‌పోర్టుకు వచ్చారు.విమానాశ్రయం లోపలికి చొరబడి ఆయుధాలతో బెదిరించి ఇద్దరు సిబ్బందిని బందీగా తీసుకున్నారు. అక్కడి నుంచి కార్గో వద్దకు వెళ్లి విలువైన లోహాలను తమ ట్రక్కులో నింపుకొని పరారయ్యారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. విమానాశ్రయం నుంచి మొత్తం 750 కిలోల బంగారం, ఇతర విలువైన లోహాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే దొంగలు దోచుకెళ్లిన లోహాల విలువ 40 మిలియన్‌ డాలర్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 276కోట్లకుపైగే ఉండోచని అధికారులు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/