హెచ్‌ 1బీ వీసాపై అమెరికా కీలక నిర్ణయం

H-1B visa
H-1B visa

వాషింగ్ట్‌న్‌: అగ్రరాజ్యంలో ఉద్యోగానికి అవసరమైన హెచ్‌1బీ వీసా విషయంలో యూఎస్‌ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగంలో చేరే తేదీకి కనీసం 90 రోజుల ముందే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు ట్వీట్‌ చేసింది. అమెరికాలో వర్క్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఉద్యోగంలో చేరే తేదీకి 90 రోజుల ముందు నుంచే ఐ 797 ఫారమ్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని ట్వీటింది. ఇక ఐ797 ఫారం అనేది దరఖాస్తుదారులు/ పిటిషనర్లతో కమ్యూనికేట్‌ చేయడానికి లేదా ఇమిగ్రేషన్‌ ప్రయోజనాన్ని తెలియజేయడానికి యూఎస్‌ సిటీజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) ఉపయోగించే పత్రం. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం యూఎస్‌సీఐఎస్‌ వైబ్‌సైట్‌లో చూడొచ్చు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/