H-1B వీసా దరఖాస్తులు ఏప్రిల్ 1 నుంచి స్వీకరణ

H-1B Visa
H-1B Visa

వాషింగ్టన్‌: హెచ్‌1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విదేశీయులు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థ పేర్కొంది. ఇందుకోసం ముందుగా 10 అమెరికా డాలర్లను ఫీజుకింద చెల్లించాల్సిందిగా ప్రకటనలో పేర్కొంది. ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం వల్ల పేపర్ పని తగ్గుతుందని, దరఖాస్తుదారులకు కూడా డబ్బులు ఆదా అవుతుందని ఏజెన్సీ వెల్లడించింది. ఇక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కేవలం కంపెనీ దరఖాస్తుదారుడికి సంబంధించిన ప్రాథమిక సమాచారం పొందుపర్చాల్సి ఉంటుంది. ముందుగా వచ్చే ఏడాది మార్చి 1 నుంచి మార్చి 20 వరకు రిజిస్ట్రేషన్ పిరియడ్ ఉంటుందని ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ తెలిపింది. ఇందులో కొన్ని దరఖాస్తులు మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుందని వారు మాత్రమే హెచ్1బీ వీసా కోసం పూర్తిస్థాయిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ స్పష్టం చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సత్ఫలితాన్ని ఇచ్చింది. ఇకపై దీన్ని పూర్తస్థాయిలో అమలు చేస్తామని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని అధికారులు చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/