ఇరాన్‌పై ఆంక్షలను తీవ్రతరం చేస్తాం

Trump and Rouhani
Trump and Rouhani

వాషింగ్టన్‌ : త్వరలోనే ఇరాన్‌పై ఆంక్షలను మరింత తీవ్రం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ఒకవైపు ఇరాన్‌ నేతలను చర్చలకు పిలుస్తూనే మరోవైపు ఈ విధంగా బెదిరిస్తుండటం గమనార్హం. తమ దేశంపై ఆంక్షలు తొలగిస్తే అమెరికాతో చర్చలకు సిద్ధమేనంటూ ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రొహానీ ప్రకటించారు. అమెరికా పట్ల ఇప్పటి వరకూ అనుసరిస్తున్న ‘వ్యూహాత్మక సహనానికి బదులు ఇచ్చిపుచ్చుకునే ధోరణి’ని అనుసరించాలని తాము నిర్ణయించినట్లు ఆయన ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే రొహానీ ప్రతిపాదనను అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తోసిపుచ్చారు. సోమవారం ఆయన ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరాన్‌ నేతలు గతంలో ఇదే మాటను జాన్‌ఎఫ్‌ కెర్రీ, బరాక్‌ ఒబామాలకు కూడా చెప్పారని గుర్తు చేశారు. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌ తుది నిర్ణయం తీసుకుంటారన్న ఆయన, ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం అమెరికాకు ఒక విపత్తు వంటిదేనని తాము భావిస్తున్నామని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/