భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు

Imran-Khan
Imran-Khan

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌ ప్రజల పట్ల సంఘీభావం తెలుపున్నట్లు చెబుతూ ఈరోజు పాకిస్థాన్‌ సెక్రటేరియట్‌ ఎదుట ‘కశ్మీర్‌ అవర్‌’ ర్యాలీ నిర్వహించారు. కశ్మీరీలకు స్వేచ్ఛ లభించే వరకూ తాము వారి పక్షానే ఉంటామని ప్రపంచానికి తెలియ చెప్పేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఇమ్రాన్‌ నేడు చెప్పారు. ఈ సందర్భంగా ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. అణ్వస్త్రాలు కలిగి ఉన్న భారత్‌పాక్‌ యుద్ధభేరి మోగిస్తే దాని పర్యవసానాలు ప్రపంచం మొత్తం ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ భారత్‌ పీఓకేపై ఏదైనా మిలిటరీ చర్యకు ఉపక్రమిస్తే దాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు తమ సాయుధ బలగాలు ఎలాంటి చర్యకైనా సిద్ధంగా ఉన్నాయని మరోసారి హెచ్చరించారు. కశ్మీర్‌లో ముస్లింలు పీడనకు గురవుతుంటే అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉంటోందని విమర్శించారు. ‘ఖకశ్మీర్‌లో ఏం జరుగుతోందో ప్రపంచమంతా చూస్తోంది. అక్కడి ప్రజలు ముస్లింలు కాకపోయి ఉంటే ప్రపంచం మొత్తం వారికి అండగా ఉండేదిగ’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాదాపు 80 లక్షల మంది ప్రజలు నెల రోజులుగా నిషేదాజ్ఞల కింద ఉన్నారని.. ఈ విషయాన్ని ఐరాస సర్వసభ్య సమావేశంలో లేవనెత్తుతామని ఇమ్రాన్‌అన్నారు.

తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/