అల్బేనియాలో భారీ భూకంపం..8 మంది మృతి

earthquake in albania
earthquake in albania

టిరానా(అల్బేనియా): అల్బేనియాలో తీవ్ర స్థాయిలో భూకంపం సంభవించింది. బల్కన్‌ మీదుగా 6.4గా రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత నమోదైందని అధికారులు చెప్తున్నారు. రాజధాని టిరానాకు నైరుతి దిశగా 30 కిలోమీటర్ల దూరంలో 20 కి.మీ.ల లోతున ఈ భూకంపం కేంద్రీకృతమైందని అమెరికా జయోలాజికల్‌ సర్వే వెల్లడించింది. కాగా ఈ భూకంపంలో ఎనిమిది మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. అపార్టుమెంటు భవనాల కింద చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు చేపట్టారు. డర్రెస్‌లో కూలిన భవనం కింద నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. థుమనే లోని భవన శిధిలాల కింద రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. అంతేకాకుండా కుర్బిన్‌లో ప్రకంపనలకు భయపడి ఓ వ్యక్తి భవనం నుంచి కిందకి దూకి మృతి చెందారు. ఈ విషయంపై ఆ దేశ ప్రధాని మాట్లాడుతూ.. ఐరోపా, అమెరికా సహాయదళాలను పంపడానికి అంగీకరించాయని, టర్కీ, గ్రీకు, ఇటలీ దేశాధినేతలతో కూడా మాట్లాడానని ప్రధాని ఎడి రమా చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/