అలబామా రాష్ట్రంలో గర్భస్రావంపై నిషేధం!

abortion ban bill
abortion ban bill

అలబామా: అమెరికాలోని అలబామా రాష్ట్రం గర్భస్రావాన్ని(అబార్షన్‌) నిషేధించింది. తాజాగా ఆ రాష్ట్ర ప్రతినిధులు దీనికి సంబంధించి బిల్లును పాస్‌ చేశారు. ఐతే ఆ బిల్లుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు మద్దతుదారులు భావిస్తున్నారు. 1973లో రూపొందించిన అబార్షన్‌ చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తాజాగా బిల్లును ప్రవేశపెట్టింది. గర్భం ధరించిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఏ దశలోనైనా అబార్షన్‌ చేసుకోకూడదన్న నిబంధనతో కొత్త చట్టం రూపొందిస్తున్నారు. అబార్షన చేసే డాక్టర్లను నేరస్తులుగా పరిగణించనున్నారు. వారికి 99 ఏళ్ల వరకు శిక్ష విధించాలని నిర్ణయించారు. కేవలం తల్లికి ప్రమాదం ఉన్న కేసుల్లో మాత్రమే అబార్షన్‌కు వీలుంటుందన్నారు. అబార్షన్‌ చట్టాన్ని ఎత్తివేస్తామని అప్పట్లో ట్రంప్‌ హామీ ఇచ్చారు. ఐతే ఈ చట్టాన్ని రద్దు చేయాలంటే ట్రంప్‌ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సుప్రీంలో ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నవారు ఎక్కువే ఉన్నారు. 1973 నాటి తీర్పును రద్దుచేయాలన్న ఉద్దేశంతో కన్జర్వేటివ్‌లు ఉన్నారు. దీంతో ఇప్పుడు అలబామాలో అబార్షన్‌పై నిషేధం విధించడం సంచలనంగా మారింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/