సౌదీ రాజుతో భేటీ అయిన డోభాల్‌

Ajit doval
Ajit doval

రియాద్‌ (సౌదీ అరేబియా): జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌ సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుతం సౌదీ పర్యటనలో ఉన్న డోభాల్‌ బుధవరం యువరాజుతో భేటీ అయి కాశ్మీర్‌ అంశంపై భారత ప్రభుత్వ వైఖరిని వివరించినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సమావేశం రెండుగంటల పాటు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య బంధాలు బలోపేతం ఉద్దేశంతో డోబాల్‌ సౌదీ పర్యటనకు వెళ్లారు. యువరాజుతో జరిగిన సమావేశంలో భాగంగా ద్వైపాక్షిక బంధాలపైనా చర్చలు జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవలనే పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కూడా సౌదీ యువరాజును కలిసిన సంగతి తెలిసిందే.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/