అబుదాబి టవర్లపై భారత్‌ మువ్వన్నెల జెండా

Abu Dhabi
Abu Dhabi

అబుదాబి: అబుదాబిలో భారత్‌కు అరుదైన గౌరవం దక్కింది. గురువారం భారత ప్రధానిగా నరేంద్రమోడి రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ దేశంలో ప్రఖ్యాత ఏడీఎన్‌ఓసీ టవర్లపై భారత్‌ మువ్వన్నెల జెండాతో పాటు ఆ దేశ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. అంతేకాక ఆదేశ యువరాజు మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో మోడి కరచాలనం చేసిన చిత్రాన్ని కూడా అక్కడ ప్రదర్శించారు. అయితే ఈ అరుదైన ఘటనతో భారత్‌తో తమకున్న స్నేహబంధాన్ని అక్కడి ప్రభుత్వం చాటి చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను అక్కడి భారత రాయబారి నవదీప్ సింగ్‌ పూరి ట్విటర్‌లో పంచుకున్నారు. ఇలాంటి చర్యలతో ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/