అభినందన్‌ యాడ్‌తో పాక్‌ కవ్వింపు చర్యలు!

abhinandan
abhinandan, wing commander

ఇస్లామాబాద్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఇండియా, పాక్‌ల మధ్య ఆదివారం నాడు మ్యాచ్‌ జరగనుంది. ఐతే ఆ ఉత్కంఠ పోరుపై పాక్‌ టివి ఓ యాడ్‌ను విడుదల చేసింది. ఆ యాడ్‌లో వింగ్‌ కమాండర్‌ పోలికలతో ఉన్న వ్యక్తిని ఉంచి ఆయనకు భారత్‌ క్రికెట్‌ జెర్సీ వేసి వెటకారంగా చిత్రీకరించారు. బాలాకోట్‌ దాడి తర్వాత భారత్‌ వైమానికి దళానికి చెందిన అభినందన్‌ పాక్‌ దళాలకు చిక్కి ఎన్నో అవమానాలను భరించాడు. అతన్ని విడుదల చేసే ముందు పాక్‌ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. టీ తాగుతూ అభినందన్‌ కొన్ని ప్రశ్నలు ఎదుర్కొన్నాడు. ఎటువంటి భయం లేకుండా వారికి సమాధానాలు ఇచ్చాడు. ఐతే ఆ సంఘటనను యాడ్‌గా వాడుకుంటూ..పాక్‌ ఛానల్‌ యాడ్‌ను తయారు చేసింది. ఆ యాడ్‌లో టాస్‌ గెలిస్తే ఏం చేస్తారని ఆ వ్యక్తిని అడిగితే..ఐయామ్‌ సారీ నేనేం చెప్పకూడదంటూ ఆ వ్యక్తి అంటాడు. ఇక చివరిగా టీ కప్‌లో వెళ్తుంటే ఆ కప్పును ఎక్కడికి తీసుకు వెళ్లున్నావంటూ లాగేసుకుంటారు. ఆదివారం జరిగే ఇండో పాక్‌ మ్యాచ్‌ ఇంకెంత టెన్షన్‌గా ఉంటుందో చూడాలి మరి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/