ఫేస్‌బుక్‌కు భారీగా జరిమానా!

FACEBOOK
FACEBOOK

మాస్కో: చట్టాల అతిక్రమణకు పాల్పడిన సంస్థలపై రష్యా అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నది. సామాజిక మాధ్యమ దిగ్గజాలు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లకు మాస్కోలోని టగాన్‌స్కీ జిల్లా కోర్టు షాకిచ్చింది. ఈరెండు దిగ్గజ సంస్థలు తమ పౌరుల సమాచారాన్ని భద్రపర్చడంలో విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా చట్టాలను అతిక్రమించిన కేసుల్లో రెండు దిగ్గజ సంస్థలను దోషులుగా తేల్చింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లు వేర్వేరుగా 62,922 డాలర్లు ( రూ.44,96,632) జరిమానా చెల్లించాలని ఆదేశించింది. రష్యా అంతర్జాల నిఘా సంస్థ రోస్కోమ్‌నద్జోర్‌కు ఈ రెండు సామాజిక మాధ్యమ సంస్థలకు చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. అన్ని సామాజిక మాధ్యమాలు, అంతర్జాల సంస్థలు రష్యా పౌరుల డేటాను స్థానికంగానే భద్రపరచాలని 2014లో చట్టం తీసుకొచ్చింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/