రష్యాలో 24 గంటల్లో 8,572 కొత్త కేసులు

ఒక్కరోజుల్లో 232 మంది మృతి

Corona cases – Russia

మాస్కో: రష్యాలో కరోనా వైరస్‌ తన పంజా విసురుతుంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,572 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఆ దేశం వెల్లడించింది. శుక్రవారం వరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,87,623కు చేరుకున్నది. ఒక రోజు వ్యవధిలో మరో 232 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 4,374కు పెరిగింది. అమెరికా, బ్రెజిల్‌ తర్వాత అత్యధికంగా కరోనా కేసులు నమోదైన మూడో దేశం రష్యానే. దేశరాజధాని మాస్కోలో జూన్‌ 1 నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించాలని మేయర్‌ సెర్గోయ్‌ నిర్ణయించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/