భారీ అగ్నిప్రమాదం.. 8 మంది సజీవ దహనం

Fire at Ukraine Hotel
Fire at Ukraine Hotel

యూరప్‌: యూరప్ దేశమైన ఉక్రెయిన్ లో ఈరోజు ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ లోని ఒడెస్సా నగరంలో ఉన్నఖటోక్యో స్టార్ హోటల్గలో ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో హోటల్ అంతా వ్యాపించాయి. దీంతో 8 మంది సజీవదహనం కాగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ, అత్యవసర సేవల బృందం ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 3 గంటల పాటు కష్టపడి ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. టోక్యో స్టార్ ఓ మధ్య తరగతి హోటల్. ఇందులో 273 గదులు ఉన్నాయి. అయితే ప్రమాద సమయంలో ఈ హోటల్ లో ఎంతమంది ఉన్నారు? అగ్ని ప్రమాదం ఎందుకు సంభవించింది? అన్న విషయాలపై ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/