ఆత్మాహుతి దాడి..8 మంది మృతి

Blast hits market in east Baghdad
Blast hits market in east Baghdad

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని జమీలా మార్కెట్‌లో ఆత్యాహుతి దాడి జరిగింది. అయితే పేలుడు పదార్ధాలతో తయారు చేసిన బెల్డు ధరించిన దుండగుడు అత్యంత రద్దీగా ఉండే జమీలా మార్కెట్‌లో తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు అధికారులు చెప్పారు. ఈ దాడిలో ఎనిమిది మంది మృతి చెందగా 15 మంది గాయపడ్డినట్టు అధికారులు తెలిపారు. అయితే రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని రాజధాని ప్రాంతంలో భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ తిరుగుబాటు దారులు దాడులకు పాల్పడుతున్నారని అధికారులు వివరించారు. తెలిపారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/international-news/