జైల్లో తగాదాలు..57 మంది మృతి

Brazil jail
Brazil jail

రియోడిజెనిరో: బ్రెజిల్‌లోని అల్టామిరా జైలులో రెండు గ్రూపుల మధ్య ఏర్పడిన తగాదా రక్తపాతం సృష్టించింది. ఈ ఘర్షణలో 57 మంది చనిపోగా మరో వందమంది వరకు త్రీవంగా గాయపడ్డారు. రెండు గ్రూపులు చెలరేగి దాడులు చేసుకోవడంతో 16 తలలు తెగిపడ్డాయి. జైలు గదిలన్నీ రక్తంతో నిండియున్నాయి. తల లేని మొండాలతో ఉన్న జైలు బరాక్‌లు శ్మశానా వాటికలా కనిపించాయి. దీంతో బ్రెజిల్ అధ్యక్షుడు జాయర్ బోసాపై ఆ దేశ పౌరులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరపాలని బ్రెజిల్ అధ్యక్షుడు ఆదేశించిడంతో పాటు మళ్లీ పునరావృతం కావొద్దని పోలీస్ శాఖకు హెచ్చరించాడు. ఇప్పటి వరకు జైల్లో ఏడు లక్షల మంది ఖైదీలు శిక్షణను అనుభవిస్తున్నారు. జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలో బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది. 2017లో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన ఘర్షణలో 130 మంది ఖైదీలు చనిపోయిన విషయం తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/