బ్రెజిల్‌లో కొత్తగా 50,230 కేసులు

మొత్తం కేసులు 2,962,442

Brazil – corona

బ్రెసిలియా: బ్రెజిల్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఆ దేశంలో 50,230 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,962,442కు చేరిందని బ్రెజిల్‌ జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. మరో 1,079 మంది వైరస్‌తో చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 99,572 చేరింది. గురువారం, బ్రెజిల్‌లో 53,139 కొత్త కేసులు నిర్ధారణ కాగా, 1,237 కొత్త మరణాలు సంభవించాయి. 4.9 మిలియన్లకుపైగా కొవిడ్‌19 కేసులు నమోదవగా.. యునైటెడ్ స్టేట్స్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల్లో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/