కాబూల్‌లో కారు బాంబు పేలుడు..నలుగురు మృతి

car-bomb blast
car-bomb blast

కాబూల్‌: కాబూల్‌ జిల్లాలోని పుల్‌-ఎ-చఖ్రీ రోడ్డుపై కారు బాంబు పేలుడు జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉదయం 8:30 గంటలకు ఖాలాఇవజీర్ ప్రాంతంలో కారు బాంబు పేలుడు జరిగిందని, భద్రతాదళాల కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని జరిపిన పేలుడులో నలుగురు చనిపోగా..యూఎస్ సర్వీస్ మెన్ తోపాటు మరికొంతమంది గాయపడ్డారని అప్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నశ్రత్ రహిమి తెలిపారు. కాగా ఈ కారు బాంబు దాడులు ఎవరు చేశారనేది తెలియాల్సి ఉంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/