యుఎస్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

మృతులు హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తింపు

Road accident in guntur
Road accident in guntur

వాషింగ్టన్‌: అమెరికాలోని తెలుగు సమాజంలో విషాదం నెలకొంది. అమెరికాలోని ఎఫ్ఎం 423 ఇంటర్ సెక్షన్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారును మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మృతి చెందిన వారిని రాజా, ఆవుల దివ్య, ప్రేమ్ నాథ్ అని గుర్తించారు. వీరి స్వస్థలం హైదరాబాద్. వీరిలో రాజా, దివ్య దంపతులు. ముషీరాబాద్ లోని గాంధీనగర్ కాలనీకి చెందినవారు. కాగా, ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/