లిబియా సైనికులపై వైమానిక దాడి

28 మంది మృతి.. 12 మందికి తీవ్ర గాయాలు

Military school in Tripoli
Military school in Tripoli

ట్రిపోలీ: లిబియా రాజధాని ట్రిపోలీలోని సైనిక పాఠశాలపై వైమానిక దాడులు జరిగాయి. కొందరు ముష్కరులు తెగబడిన ఈ దాడిలో 28 మంది సైనికులు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. లిబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అమీన్‌ అల్‌ హమేషి ఈ విషయాన్ని వెల్లడించారు. సైనికులంతా గ్రౌండ్‌లో పరేడ్‌ నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. వారంతా పరేడ్‌ ముగించుకుని గుడారాల్లోకి వెళ్తుండగా విమానాల నుంచి రాకెట్లను వదిలినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సైనికులకు రక్తం అవసరం ఏర్పడింది. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సైనికులకు రక్త దానం చేయాలని అక్కడి ప్రభుత్వం ప్రజలను కోరింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/