కరోనా వదంతులు.. 27 మంది మృతి

నాటుసారా తాగితే కరోనా వైరస్‌ రాదన పుకార్లు

COVID 'cure' rumours- Iranians consume bootleg alcohol, 27 died
COVID ‘cure’ rumours- Iranians consume bootleg alcohol, 27 died

ఇరాన్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు పైగా విస్తరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యలో ఈవైరస్‌పై వదంతులు కూడా ఎక్కువగానే విస్తరిస్తున్నాయి. మద్యం తాగితే కరోనా తగ్గిపోతుందని, అసలు కరోనా వైరస్ దరి చేరదని పుకార్లు రేగాయి. దీంతో ఇరాన్ లో నాటుసారా తాగటి ఏకంగా 27 మంది చనిపోయారు. మరో 218 మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో దవాఖానకు తలించారు. మరో వైపు సోమవారం కరోనాతో ఇరాన్ లో 43 మంది చనిపోగా.. కొత్తగా 595 కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటివరకు ఇరాన్ లో 237 మంది మంది మరణించారు. మరో 7 వేల మందికి కరోనా వైరస్ సోకడంతో.. ఇరాన్ ప్రభుత్వం 70 వేల మంది ఖైదీలను విడదల చేసింది. ఇప్పటికి ఈ వైరస్ బారి నుంచి 1,14,285 మంది బయట పడ్డారు. ఇటాలీలో నిన్న ఒక్క రోజే 97 మంది చెందగా, 1797 కేసుల నమోదయ్యాయి

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/