భారత సంతతి శాస్త్రవేత్తకు 24 కోట్ల గ్రాంటు

Veena Sahajavalla
Veena Sahajavalla

ఆస్ట్రేలియా: భారత సంతతి శాస్త్రవేత్త వీణ సహజవల్లకు ఆస్ట్రేలియాలో దాదాపు రూ.24 కోట్ల గ్రాంటు లభించింది. బ్యాటరీ వ్యర్థాలను రీసైకిల్‌ చేసే ప్రాజెక్టులో భాగంగా ఆమెకు ఈ ప్రోత్సాహకాన్ని అందజేశారు. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద బ్యాటరీ వ్యర్థాలపై రసాయానిక చర్యలు జరిపి విలువైన వస్తువులు తయారు చేయడంలో వీణ పరిశోధనలు చేస్తున్నారు. ఆమె ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సస్టెయినెబుల్‌ మెటీరియల్స్‌ రీసెర్చి, టెక్నాలజీ (స్మార్ట్‌) హబ్‌కు వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఉన్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/