సుడాన్లో భారీ అగ్ని ప్రమాదం..23 మంది సజీవదహనం
130 మందికి గాయాలు

ఖర్తూమ్: సుడాన్లో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 23 మంది సజీవదహనంకాగా 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. టైల్స్ తయారీ చేసే ఫ్యాక్టరీలో ట్యాంకర్లోకి గ్యాస్ అప్లోడ్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారు అరుచుకుంటు రోడ్డు మీదకు పరుగులు తీశారు. క్షతగాత్రులను అంబులెన్స్ ల్లో బహరి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 50 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతులు సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటి వరకు 14 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని వాలెంటర్ హుస్సేన్ ఓమర్ తెలిపాడు. క్షతగాత్రులకు రక్తదానం చేయడానికి దేశ పౌరులు ముందుకు రావాలని సూడాన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/