2050 నాటికి చైనాను మించ‌నున్న భార‌త్‌

POPULATION
POPULATION

2050 వ సంవత్సరం నాటికి భారత్‌ జనాభా, చైనా కంటే 25 శాతం అధికంగా ఉంటుందని వాషింగ్‌టన్‌కు చెందిన పాపులేషన్‌ రిఫరెన్స్‌ బ్యూరో (జనాభా లెక్కల బ్యూరో) వెల్లడించింది. 2018 ప్రపంచ జనాభా గణాంకాలను పీఆర్బీ సంస్థ తాజాగా విడుదల చేసింది. 2030 నాటికి భారత్‌ జనాభా చైనా కంటే 8 శాతం అధికంగా ఉంటుందని జనాభా లెక్కల బ్యూరో అంచనా వేసింది. ప్రస్థుతం భారత్‌ కంటే చైనా జనాభా అధికంగా ఉంది. భారత్‌ లో 1.37 బిలియన్ల మంది జనాభా ఉన్నారు. భారత్‌ కంటే అధికంగా చైనాలో 1.39 బిలియన్ల మంది జనాభా నివశిస్తున్నారు. 2050 నాటికి చైనా జనాభా 1.34 బిలియన్లకు తగ్గుతుందని, భారత్‌ జనాభా 1.68 బిలియన్లకు పెరుగుతుందని పీఆర్బీ అంచనా వేసింది.