ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి 20 మంది మృతి

Oil Tanker Explosion
Oil Tanker Explosion

కంపాలా: ఉగండాలోని రుబురిజి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 20 మంది మృతి చెందగా 50 మంది వరకు గాయపడ్డారు. ఆయిల్ ట్యాంకర్ కెన్యా నుంచి రిపబ్లిక్ కాంగో వెళ్తుండగా మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో వందలాది షాపులు కాలిపోయాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతదేహాలను రిబురిజి ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని స్థానిక పోలీస్ అధికారి తుముసిమ్ తెలిపారు. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ చివరి వరకు ప్రయత్నించినప్పటికి ఈ ప్రమాదాన్ని ఆపలేకపోయారని స్థానికులు వెల్లడించారు. ఎదురుగా వచ్చిన వాహనం తప్పిదం వలనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/