నేపాల్‌లో బస్సు ప్రమాదం, ఇద్దరు భారతీయుల మృతి

bus accident
bus accident

కాట్మండూ: నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 60 మంది భారత పర్యాటకులతో వెళ్తున్న ఓ బస్సును ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని, మరో 21 మందికి తీవ్రగాయాలయ్యాయని మంగళవారం అధికారులు ప్రకటించారు. అటవీ ప్రాంతంలో బస్సు ఆగిపోయిందని అదే సమయంలో వెనకనుంచి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు దాన్ని ఢీకొందని స్థానిక పోలీసులు వివరించారు. దీంతో ప్రయాణికులు ఉన్న బస్సు 20మీటర్ల మేర అడవిలోకి దూసుకెల్లిందని తెలిపారు. మృతులు ఇద్దరూ ఒడిశాకు చెందిన వారేనని తెలిపారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/