మెక్సికోలో ఎదురుకాల్పులు..19 మంది మృతి

మెక్సికోలో భద్రతా బలగాలు, డ్రగ్స్ ముఠాకు మధ్య కాల్పులు

Gun fire
Gun fire

మెక్సికో: మెక్సికోలో భద్రతా బలగాలు, డ్రగ్స్ ముఠాకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో మొత్తం 19 మంది మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా సరిహద్దుకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోని విల్లా యూనియన్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని ఓ భవనంలోకి దుండగులు ప్రవేశించినట్టు తెలుసుకున్న భద్రతా దళాలు భవనాన్ని చుట్టుముట్టాయి. దీంతో డ్రగ్స్ ముఠా కాల్పులు ప్రారంభించింది. అప్రమత్తమైన భద్రతా దళాలు కూడా కాల్పులు ప్రారంభించడంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కొన్ని గంటలపాటు జరిగిన కాల్పుల్లో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది డ్రగ్స్ ముఠాకు చెందిన వారు కాగా, ఇద్దరు పౌరులు, మరో నలుగురు పోలీసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనా స్థలం నుంచి 14 ట్రక్కులు, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/