పాక్‌లో ఘోర ప్రమాదం..19 మంది మృతి

వాహనాన్ని ఢీకొట్టిన రైలు.. సిక్కు యాత్రికులు మృతి

19 dead as train hits bus carrying Sikh pilgrims in Pakistan

పాకిస్థాన్‌: పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రైల్వేక్రాసింగ్ వద్ద బస్సును అతివేగంతో వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది సిక్కు యాత్రికులు మరణించారు. మరికొందరికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు.  మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ది.  క‌రాచీ నుంచి లాహోర్ వెళ్తున్న స‌మ‌యంలో ఈ దుర్ఘ‌ట‌న‌ జ‌రిగింది. షేక్‌పురా రైల్వే స్టేష‌న్ వ‌ద్ద షా హుస్సేన్ ఎక్స్‌ప్రెస్‌ను.. సిక్కు యాత్రికులు వెళ్తున్న వాహ‌నం ఢీకొట్టింది. నాన్‌కానా సాహిబ్ నుంచి తిరుగు ప్ర‌యాణం చేస్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న త‌ర్వాత డివిజిన‌ల్ ఇంజినీర్‌ను స‌స్పెండ్ చేశారు. బాధ్యులైన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రైల్వే మంత్రి షేక్ ర‌షీద్ ఆదేశించారు. నాలుగు నెల‌ల క్రితం సింధు ప్రావిన్సులో కూడా రైల్వే క్రాసింగ్ వ‌ద్ద ప్ర‌మాదం జరిగింది. ఆ ప్ర‌మాదంలో 19 మంది మ‌ర‌ణించారు. 30 మంది గాయ‌ప‌డ్డారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/