మారణహోమానికి పద్దెనిమిదేళ్లు

wolrd trader
wolrd trader

వాషింగ్టన్‌: అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రవాదులు చేసిన దాడులకు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. 9/11 దాడులు ప్రపంచ చరిత్రలో ఒక విషాద జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఈ మారణహోమంలో వేల మంది చనిపోయారు. సౌదీ అరేబియా, అరబ్‌ దేశాలకు చెందిన వారే ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. వీరికి ఆల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ నేతృత్వం వహించాడని తెలుసుకున్నారు. ఈ విధ్వంసం జరిగిన నేటికి 18 యేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా అమెరికా మృతులకు నివాళులర్పించారు. హైజాకర్లు రెండు విమానాలను న్యూయార్క్‌లోని ప్రపంచ వాణాజ్య సెంటర్‌కు చెందని రెండు భవనాలను ఢీకొట్టాయి. ఈ దాడిలో ప్రయాణికులు, భవననాల్లో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు, మృతిచెందారు. అందరూ చూస్తుండగానే రెండు భవనాలు కుప్పకూలిపోయాయి. సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయి. వాణిజ్య సంస్థ దాడిలో చనిపోయిన 2,752 మందిలో 343 మంది అగ్నిమాపక సిబ్బంది, 60 మంది న్యూయార్క్‌, పోర్ట్‌ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులున్నారు. పెంటగన్‌పై జరిగిన దాడుల్లో 180 మంది దుర్మరణం పాలైనారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/international-news/