ఎవరెస్ట్‌ ప్రక్షాళనలో బయటపడ్డ నాలుగు మృతదేహాలు

waste collection
waste collection


ఖాట్మండు: ప్రపంచంలోనే అతిఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ ప్రక్షాళనలో భాగంగా నాలుగు మృతదేహాలను వెలికితీశారు. రెండు నెలల పాటు సాగిన ఈ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా కొన్ని ఏళ్ల నుంచి పేరుకుపోయిన 11 వేల కేజీల చెత్తను తొలగించినట్లు నేపాల్‌ ప్రభుత్వం తెలిపింది. పర్వతారోహణలో భాగంగా ఇక్కడ సుమారు 300 మంది వరకు చనిపోయి ఉండవచ్చని ఆ దేశ అధికాయిల అంచనా వేస్తున్నారు. మృతేదేహాలు మంచు అడుగున్న పడి ఉండవచ్చని, వేసవిలో మంచు కరగడంతో కొన్ని బయటకు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే నాలుగు మృతదేహాలను వెలికితీశారు. ఐతే వారు ఎప్పుడు, ఎలా చనిపోయారో వివరాలు తెలియడం లేదని అధికారులు చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/