హామిల్ట‌న్ ఇంటి ద‌గ్గ‌ర‌లో మాల్యా విల్లా కొనుగోలు

Vijay Malya
Vijay Malya

లండ‌న్ః ఇండియా నుంచి పారిపోయి లండన్ లో మకాం వేసిన విజయ్ మాల్యా, అత్యంత ఖరీదైన ‘లేడీ వాక్’ ప్రాంతంలో ఫార్ములా వన్ చాంపియన్ హామిల్టన్ ఇంటికి సమీపంలో రూ. 39.7 కోట్లు వెచ్చించి ఓ విల్లాను కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ఖరారు చేసిన బ్రిటన్ ఎస్ఎఫ్ఓ (సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్), ఆ సమాచారాన్ని భారత సీబీఐకి అందించింది. మాల్యా ఇరుగు పొరుగుగా, కోటీశ్వరులు మాత్రమే ఉన్నారని తెలుస్తోంది. యూబీ గ్రూప్ చైర్మన్ గా మాల్యా ఉన్న సమయంలో 17 బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మొత్తం, వడ్డీలతో కలిపి రూ. 9 వేల కోట్లకు చేరగా, వాటిని తిరిగి చెల్లించే మార్గం కనిపించని స్థితిలో లండన్ కు మాల్యా పారిపోయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో యాక్సిస్ బ్యాంకులోని కింగ్ ఫిషర్ ఖాతా నుంచి లండన్ లోని మాల్యా బ్యాంకు ఖాతాకు రూ. 242 కోట్లు బదిలీ అయినట్టు కూడా ఎస్ఎఫ్ఓ అధికారులు వెల్లడించారు.