స్వదేశానికి లెబనాన్‌ ప్రధాని హరిరి

SAAD HARIRI
SAAD HARIRI

బీరట్‌: లెబనాన్‌ ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరిని దిగ్భ్రాంతికి గురి చేసిన సాద్‌ హరిరి రెండు వారాలనంతరం బీరుట్‌కి తిరిగి రావడంతో అందరి నిఘా ఆయనపైనే ఉన్నాయి. నిన్న రాత్రి దేశ రాజధానికి చేరుకున్నారు. నేడు లెబనాన్‌ స్వాతంత్య్రం స్వాతంత్య్ర దినోత్సవం కాగా, హరిరి రాజీనామతో దేశంలో అనిశ్చితి నెలకొంది. రాజకీయ సుస్థిరతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఇరాన్‌, సౌదీ అరేబియాల మధ్య ప్రాంతీయ విభేదాలు హెచ్చురిల్లుతాయన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఈ స్థితుల్లో లెబనాన్‌ గడ్డపై హరిరి రాజీనామా చేస్తేనే తామా ఆమోదించగలమని లెబనాన్‌ అధికారులు వ్యాఖ్యానించారు సౌదీ అరేబియాలో హరిరి నిర్బంధంలో ఉన్నారని, అంతకు మునుపు వారు ఆరోపించారు. ఐతే వాటిని హరిరి తిరస్కరిస్తూ తానెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చే స్వేచ్ఛ ఉందని చెప్పారు. హరిరి రాజీనామాను అధికారికంగా అమోదించాలన్నా ముందు ఆయన స్వదేశానికి రావాల్సి ఉంటుందని సొంత పార్టీ వ్యూచర్‌ మూవ్‌మెంట్‌ నేతలే డిమాండ్‌ చేస్తున్నారు. శనివారం సౌదీ అరేబియా నుండి పారిస్‌ వెళ్లిన హరిరి అక్కడ మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనేందుకు తాను లెబనాన్‌ వెళతానని చెప్పారు. అక్కడే అన్ని అంశాలపై తన వైఖరి స్పష్టం చేస్తానని తెలిపారు.