సార్క్‌మీటింగ్‌కు పాక్‌మంత్రి నిరసన వ్యక్తంచేస్తూ భారత్‌

PAK-INDIA
PAK-INDIA

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరుగుతున్న సార్క్‌ ఈసమావేశానికి పాక్‌ అక్రమిత్‌ కశ్మీర్‌ (పిఓకే)కు చెందిన మంత్రి చౌదరి మొహమ్మద్‌ సయిద్‌ రావడంతో నిరసన వ్యక్తంచేస్తూ భారత్‌ దౌత్యాధికారి శుభం సింగ్‌ సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. సార్క్‌ ఛార్డ్‌ డే సందర్భంగా అదివారం ఇస్లామాబాద్‌లో సార్క్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పీఓకే మంత్రి కూడా హాజరయ్యారు.‌ అయితే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌ తమ భూభాగంగానే పరిగణిస్తోంది. దీంతో అక్కడి నుంచి మంత్రి సమావేశానికి రావడాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది.