శ్వేత‌సౌధం ఎదుట ఆత్మ‌హ‌త్య‌

White House
White House

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష భవనం శ్వేత‌సౌధం ముందు శనివారం ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. శనివారం నాటు తుపాకీతో వైట్‌ హౌస్‌ ముందుకొచ్చిన ఒక వ్యక్తి ఆకస్మాత్తుగా తనను తాను కాల్చుకున్నాడని అతడు అక్కడికక్కడే చనిపోయాడని స్థానిక పోలీసులు వివరించారు. ఈ వ్యక్తి ఎవరన్న విషయం ఇంకా వెల్లడికాలేదని, అయితే అతడు తనపై తాను కాల్పులు జరుపుకుంటున్న సమయంలో భారీయెత్తున ప్రజలు అక్కడ గుమిగూడారని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ వాషింగ్టన్‌పోస్ట్‌ పత్రిక తన తాజా సంచికలో ప్రచురించిన వార్తా కథనంలోపేర్కొంది.