విమానం అత్యవసర ల్యాండింగ్‌….ప్రయాణికులకు గాయాలు

SAUDI ARABIAN AIRLINES
SAUDI ARABIAN AIRLINES

రియాద్‌: సౌదీఅరేబియా ఎయిర్‌ లైన్స్‌ విమానాన్ని జెడ్డాలోని వెస్టర్న్‌ రెడ్‌సీ సిటీలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. ఎయిర్‌బస్‌ ఏ330 హైడ్రాలిక్‌ యంత్రంలో సమస్య రావడంతో…రన్‌వేపై ల్యాండింగ్‌ చేస్తున్న సమయంలో అదుపుతప్పింది. దీంతో రన్‌వేపై మంటలు చెలరేగాయి. ప్రయాణికులను అత్యవసర మార్గం ద్వారా కాపాడే క్రమంలో 53 మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. విమానం 151 మంది ప్రయాణికులతో మెదీనా నుంచి ఢాకాకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.