విటి వినియోగం అర్థంకావడం లేదు

Chinese Troops Didn't Know How to Use Their High-Tech New Tanks
Chinese Troops Didn’t Know How to Use Their High-Tech New Tanks

బీబింగ్‌: చైనా తయారు చేసిన యుద్ద ట్యాంకులను ఆ దేశ సైనికులే వినియోగించలేకపోతున్నారు. ఈవిషయాన్ని చైనాకు చెందిన గ్లోబల్‌టైమ్స్‌ పత్రిక, చైనా సెంట్రల్‌ టెలివిజన్‌లు వెల్లడించాయి. ఈట్యాంక్‌లు సాంకేతికంగా ఎంతో ఉన్నత స్థాయికి చెందినవి కావడంతో వీటి వినియోగం సైనికులకు అర్థంకావడం లేదని పేర్కొంది. చైనాకు చెందిన ఎలైట్‌ ఆర్మ్‌డ్‌ బ్రిగేడ్‌ ది టైప్‌ 99ఏ రకం యుద్ధ ట్యాంకులను తొలిసారి నడిపాయి. అప్పట్లో జరిగిన ఓ పోరాటంలో పాత ట్యాంకులతో ఇవి తలపడ్డాయి. టైప్‌ 99ఏ ట్యాంక్‌లు పూర్తిగా డిజిటల్‌ తరహావి. కొత్త ట్యాంక్‌ల మధ్య బలమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ఉన్నాయి. శత్రువుకు కనపడకుండా దాడి చేయగల (బియాండ్‌ విజువల్‌ రేంజి అటాక్‌) సామర్థ్యం ఉంది.