రిషీకపూర్‌ పూర్వీకుల ఇంటిని మ్యూజియంగా మారుస్తాం

rajkapoor house
rajkapoor house

ఇస్లామాబాద్‌: బాలీవుడ్‌ నటుడు రిషీ కపూర్‌ పూర్వీకులకు చెందిన ఇంటిని మ్యూజియంగా మార్చాలని పాకిస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. పెషావర్‌లోని ఖిస్సా ఖవానీ బజార్‌లో ఈ ఇల్లు ఉంది. దీనిని మ్యూజియం లేదా ఏదైనా సంస్థగా మార్చాలని రిషీ కపూర్‌ పాకిస్థాన్‌ను కోరాడు. అతని కోరిక మేరుకు మ్యూజియంగా మారుస్తున్నట్లు పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ వెల్లడించారు. బుధవారం రాత్రి ఇండియన్ జర్నలిస్టులతో మాట్లాడిన ఆయన.. ఈ విషయాన్ని రిషీ కపూర్‌కు చెప్పమని కోరారు. రిషీ కపూరే కాల్ చేశాడు.