రాజకీయ అనిశ్చితికి తెర.. అధ్యక్షుడిగా టోరా

Quim Torra
Quim Torra

మాడ్రిడ్‌్‌: కెటలోనియా అధ్యక్షుడిగా స్వాతంత్య్ర అనుకూల మద్ధతుదారు క్విమ్‌ టోరాను కెటలోనియా రీజనల్‌ పార్లమెంట్‌ ఎన్నుకుంది. దీంతో స్పెయిన్‌లో ఈశాన్య ప్రాంతంలో నెలల తరబడి నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ముగింపు పలికింది. కెటలన్‌ మాజీ నేత కార్లెస్‌ ఫుడ్జిమెంట్‌కు సన్నిహితుడైన టోరా(55) సోమవారం జరిగిన ఎన్నికల్లో సాధారణ మెజారిటీతో గెలుపొందారు. 66మంది ఎంపీలు ఆయనకు మద్ధతు ఇవ్వగా నలుగురు గైర్హాజరయ్యారు. 65మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. భవిష్యత్‌ కెటలన్‌ రిపబ్లిక్‌ కోసం రాజ్యాంగ మూసాయిదా రూపొందిస్తారని టోరా హామీ ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్‌ 1వ తేదీన కెటలోనియా స్వాతంత్య్రం కోరుతూ నిర్వహించిన నేపథ్యంలో స్పెయిన్‌ కోర్టులు సెస్పెండ్‌ చేసిన ప్రాంతీయ చట్టాలను పునరుద్ధరిస్తారని హామీ ఇచ్చారు.