యుద్ధం జరిగితే ప్రపంచానికే నష్టం..!

Imran-Khan
Imran-Khan


పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యలు
ఇస్లామాబాద్‌: మరోసారి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసినప్పటి నుంచి తీవ్ర అవమానాలకు గురవుతున్నా బుద్ధి తెచ్చుకోలేని ఇమ్రాన్‌ఖాన్‌ తాజాగా అణ్వస్త్రాలు కలిగి ఉన్న భారత్‌-పాక్‌ యుద్ధభేరి మోగిస్తే దాని పర్యవసానాలు ప్రపంచం మొత్తం ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం పాక్‌ సెక్రటేరియట్‌ ఎదుట ‘కాశ్మీర్‌ అవర్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. భారత్‌ పిఓకేపై ఏదైనా మిలిటరీ చర్యకు ఉపక్రమిస్తే దాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు తమ సాయుధ బలగాలు ఎలాంటి చర్యకైనా సిద్ధంగా ఉన్నాయని మరోసారి హెచ్చరించారు. కాశ్మీర్‌లో ముస్లింలు పీడనకు గురవుతుంటే అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉంటోందని ఖాన్‌ విమర్శించారు. కాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత భారత్‌ తీరును తప్పుగా చూపించాలని పాకిస్థాన్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/