యాంకర్‌కు పాక్‌ క్రికెటర్‌ ఆజం వార్నింగ్‌

babar azam
babar azam

అబుధాబి: పాకిస్థాన్‌ క్రికెటర్‌ బాబర్‌ ఆజం. పాకిస్థాన్‌ జర్నలిస్ట్‌, యాంకర్‌ జైనాబ్‌ అబ్బాస్‌ తీరుపై తీవ్రంగా మండిపడ్డాడు. మాట్లాడే ముందు కాస్త ఆలోచించు నీ హద్దులో ఉండు అంటూ హెచ్చరించాడు. అయితే ఏం జరిగిందింతే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజం టెస్టుల్లో తొలి సెంచరీ చేశాడు. దీనిపై మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సహా చాలా మంది బాబర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఇందులో జైనాబ్ అబ్బాస్ కూడా ఉంది. అయితే ఆమె కంగ్రాట్స్ చెప్పిన తీరు అతనికి నచ్చలేదు. తన కొడుకులాంటి ఆజం సెంచరీ చూ మురిసిపోతున్న కోచ్ మిక్కీ ఆర్థర్‌కు మిగతా టీమ్ శుభాకాంక్షలు చెబుతుంటే ముచ్చటేసింది అని ఆమె ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌ను సరిగా అర్థం చేసుకోలేకపోయిన ఆజం.. చాలా సీరియస్‌గా రియాక్టయ్యాడు. మాట్లాడే ముందు ఆలోచించు.. హద్దులు దాటకు అంటూ మరో ట్వీట్‌లో ఆజం ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు.