మోడికి ఫోన్‌ చేసి మాట్లాడిన ట్రంప్‌

modi, trump
modi, trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం ప్రధాని మోడితో ఫోన్‌లో మాట్లాడారు. వాణిజ్య సంబంధాలు గురించి వార్దిరూ సంభాషించినట్లు వైట్‌హౌజ్‌ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌తో ఉన్న సంబంధాల అంశంలోనూ సహకారాన్ని పెంపొందిచాల్సిన అవసరంపై ఇద్దరూ మాట్లాడారు. 2019లో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాలను బలపరచాలని నిర్ణయించారు. వాణిజ్య లోటును పూడ్చేందుకు కావాల్సిన చర్యల గురించి మాట్లాడుకున్నారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత అంశాన్ని కూడా చర్చించారు.