భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌

Kenneth
Kenneth

వాషింగ్టన్‌: భారత్‌కు అమెరికా రాయబారిగా కెన్నత్‌ జస్టర్‌ పేరును ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. జనవరి 20 నుండి ఖాళీగా
ఉన్న ఈ పదవి భర్తీ కోసం ట్రంప్‌ ఈ రోజు కెన్నెత్‌ పేరు ప్రకటించారు. సెనేట్‌ ఆమోదం తర్వాత భారత్‌కు రాయబారిగా వచ్చే
అవకాశం ఉంది. 62 ఏళ్ల కెన్నెత్‌కు భారత్‌ వ్యవహారాల్లో ఆయనకు పట్టు ఉంది. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ ఆర్ధికవ్యవహారాల్లో
ట్రంప్‌కు డిప్యూటి అసిస్టెంట్‌గా, జాతీయ ఆర్ధిక మండలిలో ఉప సంచాలకులుగా పనిచేస్తున్నారు. ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఈ పదవి ఖాళీగా ఉంది.