భరోసా ఉంటే భారత్‌కు:జకీర్‌నాయక్‌

Zakeer naik 121
Zakeer naik

మలేషియాలో తలదాచుకున్న వివాదస్పద ముస్లిం మత ప్రబోధకుడు జకీర్‌నాయక్‌ భారత్‌కు వస్తున్నడంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని, తాను భారత్‌కు రావడం లేదని చెప్పారు. జకీర్‌ నాయక్‌ విద్వేషపూరిత ప్రసంగాలకు ఆకర్షితుడైన ఓ వ్యక్తి ఐసిసిలో చేరి 2016లో బంగ్లాదేశ్‌ రాజదాని ఢాకాలో దాడులకు పాల్పడ్డాడు. తన దాడులకు జకీర్‌ ప్రసంగాలేనని ఆ తర్వాత అన్నాడు. దీంతో జకీర్‌ భారత్‌ నుంచి పారిపోయి మలేషియాలో తలదాచుకున్నాడు. తాజాగా, మలేషియా నుంచి జకీర్‌ భారత్‌కు బయలుదేరుతున్నాడంటూ మలేషియా ప్రభుత్వానికి చెందిన ఓ వ్యక్తి నుంచి సమాచారం అందింది. దీనిపై జకీర్‌ స్పందిస్తూ, అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశాడు. తన పట్ల భారత ప్రభుత్వం న్యాయంగా వ్యవహరిస్తుందన్న భరోసా కలిగినప్పుడు, తనకు రక్షణ ఉంటుందన్న భావన కలిగినప్పుడే మాత్రమే స్వదేశానికి వస్తానని చెప్పారు.జకీర్‌ తరపు న్యాయవాది మాట్లాడుతూ జకీర్‌ను మలేషియా ప్రభుత్వం భారత్‌ వెళ్లిపోమ్మని చెప్పలేదని తెలిపారు. జకీర్‌కు ఎలాంటి సమాచారం అందలేదని కేంద్ర హోంశాఖ కూడా తెలిపింది. తీవ్రవాదులకు అనుకూలంగా ఉన్న జకీర్‌ నాయక్‌ను అప్పగించాలంటూ మలేషియాను భారత్‌ కోరుతున్న విషయం విదితమే.