బ్రెజిల్‌ మాజీ అధ్య‌క్షుడు లూలా అరెస్టుకు కోర్టు అనుమతి

Luiz Inácio Lula da Silva
Luiz Inácio Lula da Silva

రియో డీ జెనీరో : మాజీ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డసిల్వా అరెస్టుకు వారెంట్‌ జారీ చేసేందుకు బ్రెజిల్‌ న్యాయ వ్యవస్థకు అప్పీల్స్‌ కోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. లూలా పెట్టుకున్న అప్పీళ్ళ క్రమం ముగిసేవరకు జైలుశిక్ష అమలు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిన కొద్ది గంటల్లోనే ఈ అనుమతి వెలువడింది. లూలా అరెస్టుకు ఆదేశాలు జారీ చేసేందుకు ఫెడరల్‌ న్యాయమూర్తి సెర్గియో మోరోకు మార్గాన్ని కోర్టు సుగమం వేసింది. గతేడాది ఆకర్షణీయమైన ప్రభుత్వ కాంట్రాక్టులు గెలుచుకున్న నిర్మాణ కంపెనీ నుండి ముడుపులను స్వీకరించిన కేసులో లూలాను న్యాయమూర్తి మోరో దోషిగా నిర్ధారించారు.