ఫ్రాన్స్‌లో కాల్పుల క‌ల‌క‌లం

France
France

పారిస్‌: ఫ్రాన్స్‌లో ఉగ్రవాదులు కాల్పులతో కలకలం సృష్టించారు. ట్రెబ్స్‌ అనే పట్టణంలో రెండు వేర్వేరు చోట్ల కాల్పులు జరిపారు. ఓ పోలీసు అధికారిపై కాల్పులు జరపడంతో పాటు 8 మందిని సూపర్‌మార్కెట్‌లో బందించారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. సూపర్‌ మార్కెట్‌ వద్ద వ్యక్తులను బందీలుగా చేసుకునే  ప్రయత్నంలో ముష్కరుడు పోలీసుపై కాల్పులు జరిపినట్లు భద్రతా సిబ్బంది వెల్లడించారు. నగరంలోని సూపర్‌ యూ సూపర్‌మార్కెట్‌ వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.  సాయుధుడైన ఓ వ్యక్తి మార్కెట్‌లోకి ప్రవేశించగానే కాల్పుల శబ్దం వినిపించినట్లు అక్కడి వాళ్లు చెప్పినట్లు సమాచారం. భద్రతా సిబ్బంది సూపర్‌ మార్కెట్‌ ప్రాంతాన్నంత సీజ్‌ చేసి సహాయక చర్యలు ప్రారంభించారు. మార్కెట్‌ను చట్టుముట్టి బందీలుగా ఉన్న వ్యక్తులను కాపాడేందుకు ఆపరేషన్‌ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక  చర్యలు చేపడుతున్నామని ఫ్రాన్స్‌ అంతర్గత మంత్రి వెల్లడించారు.