పైలట్‌ సిగరెట్‌ తాగడం వల్ల 51 మంది మృతి

 

US-Bangla plane crash that killed 51 caus
US-Bangla plane crash that killed 51 caus

కాఠ్‌మాండూ: గత సంవత్సరం మార్చిలో నేపాల్‌లో కాక్‌పిట్‌లో విమానం నడుపుతున్న పైలట్‌ సిగరెట్‌ కాల్చడం వల్ల ఆ విమానంలో ప్రమాదానికి గురై 51 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ప్రమాదం జరిగిన సమాయంలో వివరాలు తెలియలేదు. అయితే దరాప్తు ఆనంతరం ప్రమాదానికిక గల కారణాలు తాజాగా వెల్లడయ్యాయి. కాక్‌పిట్‌లో పొగ తాగడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు విచారణలో తేల్చారు. యూఎస్‌బంగ్లా విమానయాన సంస్థకు చెందిన బంబార్డియర్‌ యూబీజీ211 విమానాన్ని గత ఏడాది మార్చి 12న నేపాల్‌లోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగి విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది సహా 51 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 67మంది ఉన్నారు. పైలట్‌ సిగరెట్‌ తాగడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు.