పుల్వామా దాడిపై మమ్మల్ని నిందించవద్దు

pulawama attack
pulawama attack

పాకిస్తాన్‌ విదేశాంగశాఖ
ఇస్లామాబాద్‌: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోజరిగిన ఉగ్రదాడికి పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్‌ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ఎలాంటి దర్యాప్తు లేకుండా ఏకపక్షంగా భారత్‌మీడియా పాకిస్తాన్‌కు లింకు ఉందని ఆరోపించడం సరికాదని ప్రకటించింది. జమ్ముకాశ్మీర్‌మూడేళ్ల మిలిటెన్సీ ఒక ఎత్తయితే జైషేమొహ్మద్‌ ఆధ్వర్యంలోని ఉగ్రసంస్థ ముందురోజు నిర్వహించినఆత్మాహుతి దాడి ఒక ఎత్తు అనితేలింది. మొత్తం 40 మందిని పుల్వామాలో జరిగిన దాడిలో సిఆర్‌పిఎఫ్‌ జవాన్లను పొట్టపెట్టుకున్న ఉగ్రవాదసంస్థకు పాకిస్తాన్‌ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని బుకాయించింది.పుల్వామాలో జరిగిన దాడి తీవ్రంగాపరిగణించాల్సినఅంశమని పాక్‌ విదేశాంగశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ముక్తసరిగా ఖండిస్తూ ఒక ప్రకటనను విడుదలచేసింది. భారత్‌మీడియా, ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు, విచక్షణ పరిశీలనలేకుండా పాక్‌ హస్తం ఉందని ఆరోపిస్తుండటాన్ని విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌ విదేశాంగ ప్రతినిధి మహమ్మద్‌ ఫైసల్‌ మాట్లాడుతూ కాశ్మీర్‌లోయలో ఎలాంటి హింసాత్మకచర్యనైనా తాము నిరంతరం ఖండిస్తామని, అయితే భారత్‌ మాత్రం పాకిస్తాన్‌నే నిందిస్తోందని పేర్కొన్నారు పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి ప్రత్యేకంగా తమను నిందించడం సరికాదన్నారు. పొరుగుదేశంపై విమర్శలుచేయడాన్ని నిలిపివేయాలని, ముందు ఉగ్రవాదులను తమ గడ్డపైనుంచి తరిమివేయాలని పాక్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో జైషేసంస్థ ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్‌అజర్‌ను ప్రకటించాలని, నిషేధం ప్రకటించాలని భారత్‌ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే.