పిన్న వ‌య‌స్సులో మ‌లేషియా మంత్రి

Abdul rehman
Abdul rehman

మలేషియా: 25 ఏళ్లు వయసులో ఎవరైనా చక్కగా చదువుకొని ఏదో ఉద్యోగం చేసుకుందామని ఆలోచిస్తారు. అతను మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. అందుకే యువ మంత్రిగా ఏదిగి ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. అతనే సయ్యద్ సాదిక్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్. మలేషియాలో మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. దక్షిణ ఆసియాలో అతి పిన్న వయసులో మంత్రి అయిన యువకుడిగా రికార్డ్ సృష్టించాడు. 1992లో జన్మించిన సయ్యద్ ప్రస్తుతం యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ బాధ్యతలు చేపట్టాడు. ఎన్నికల్లో గెలువకముందే ప్రజల హృదయాలను గెలిచాడు. సోషల్‌మీడియా ద్వారా తన రాజకీయ ప్రణాళికలకు, విద్యార్థి ఉద్యమాల్లో క్రీయాశీలకంగా పాల్గొని మంచి గుర్తింపు సాధించాడు. ఈ యువ మంత్రిని ఇన్‌స్టగ్రామ్‌లో మిలియన్ కన్నాఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నారు. అతడు పెట్టే పోస్టులకు ఎక్కువ మంది యువకులు ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రపంచగమనాన్ని మార్చాలని పిలుపునిస్తున్నాడు. కనీస అవసరాలు, అభివృద్ధి మీద ప్రధానంగా మార్పు రావాలని అతడు కోరుతున్నాడు. అంతేకాదు మలేషియా యువతకు ఈ యువ మంత్రి ఓ ఐకాన్‌గా నిలుస్తున్నాడు.