నెట్‌ యువతకు జీవితంలో నిత్యకృత్యం

INTERNET USAGE
INTERNET USAGE

లండన్‌: నెట్‌ అనేది ప్రపంచంలో నిత్యకృత్యమైపోయింది. నెట్‌ లేకపోతే నిమిషం కూడ ఉండలేకపోతుంది ప్రస్తుత యువత. ప్రతిరోజు ఛాటింగ్‌లు, పోస్ట్‌లు,షేర్లతో కాలం గడుపుతుంది. అయితే తమ వై ఫై కనెక్షన్‌ ఆగిపోతే వెంటనే తీవ్రమైన విసుగు, చికాకు వచ్చిన యెడల అందుకు తమ వ్యక్తిత్వ లోపమే కారణం. ఈ విషయాన్ని లండన్‌కు చెందిన మౌంట్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. వారు దాదాపు 18 నుంచి 68 సంవత్సరాల వయస్సున్న 630 మందిని పరిశీలించి మరి కొన్ని విషయాలను గుర్తించారు. నెట్‌ ఆగిపోతే కొందరు ఏదో కోల్పోతున్నామనే భయానికి గురవుతున్నారు. దానినే ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ (ఫోమో) అని వెల్లడించారు. దాని ప్రకారం సోషల్‌ మీడియా అనుభవం మిగితా వారికి లభిస్తుందని భావిస్తారు.నెట్‌ బానిసలుగా మారడంతో అంతకంటె ఇంకా దారుణమైన స్పందనలు కూడ వారిలో కలుగుతాయని పరిశోధకులు వివరించారు. మానసికంగా బలంగా లేనివారు ఎటువంటి భమం లేకుండా ఉండేవారు ఈ డిజిటల్‌ టెక్నాలజీ వైఫల్యంతో తీవ్రంగా స్పందిస్తారని తెలిపారు. ఈ పరిశోధన హెలియోన్‌ అనే జర్నల్‌ లో ప్రచురితమైంది. ఎంత ఎక్కువగా వస్తువులను వాడితే అంత ఎక్కువగా వాటికి లొంగిపోతాం. ఒకవేళ అవి పనిచేయకపోతే మనం విసుగుకు గురవుతాము అలాగే పూర్తిగా ఏం చేయకుండా ఉండిపోతాం అని వారు పేర్కొన్నారు. ఫోమో, ఇంటర్నెట్‌ అడిక్షన్‌, ఎక్స్‌ట్రావర్షన్‌, న్యూరోటిసిజమ్‌ వంటివి అనేక దుష్ఫలితాలకు కారణమవుతున్నాయన్నారు. అవి ప్రత్యుత్పత్తి మీద ప్రభావం చూయించడంతో పాటు ఉద్యోగంలో లక్ష్యాలను చేరడంలో వెనుకపడేయస్తాయని పరిశోధకులు తెలిపారు. అయితే వయసు పెరుగుతుంటే ఆ విసుగు తగ్గుతుందని వెల్లడించారు.